ఏ.బి.కె. ప్రసాద్
వికీపీడియా నుండి
అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్ జన్మదినం
ఆగస్టు 1. తెలుగు భాష కు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయులు
ఏ.బి.కె.ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ.బి.కె.ప్రసాద్ కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యనే
తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. వచ్చే ఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీన హోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే.
ఏబికె ఆలోచనలు
- ఏ తరానికా తరం విద్యార్థులు తెలుగులో చదువుతుంటేనేగదా తెలుగు బ్రతికేది? తెలుగుమీడియంలో చదివితే ఉద్యోగాలు రావనే భయం
వెన్నాడుతుంటే మన పిల్లలు తెలుగులో ఎందుకు చదువుతారు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ పరీక్షలు, నియామకాలన్నింటిలో తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులకు 5 శాతం అదనపు మార్కులిస్తే తెలుగు విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుప టమే కాకుండ భవిష్యత్తులో కార్యా లయాల్లో తెలుగు వాడకం పెరుగుతుంది. మారుతున్న కాలంతోపాటు, కొత్తగా వచ్చి పే పదజాలాన్నీ ఎప్పటికప్పుడు చేర్చు కుంటూ మన తెలుగు నిఘంటువుల్ని తాజా పరచుకోవాలి. తెలుగు విశ్వవిద్యా లయంతోపాటు, విశ్వవిద్యాలయాల్లోని తెలుగు విభాగాలన్నింటికీ నిఘంటువుల నవీకరణ పని అప్పజెప్పాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి