రాజనీతిజ్ఞులై * రాష్ట్రముల్ పాలించి గడియించిరి యశంబు * గమ్మవారు/ వీరాధివీరులై * పోరుల జయమంది గడియించిరి యశంబు * గమ్మవారు/ శరణాగతత్రాణ * సరణి నాత్మ నెఱింగి గడియించిరి యశంబు * గమ్మవారు/ సత్యవాక్పాలనా * శక్తిచే బొగడొంది గడియించిరి యశంబు * గమ్మవారు/ అర్ధిజనకల్పతరువులై * యలరి మిగుల/ గడనజేసిరి యశమును * గమ్మవారు/ మించు ధర్మంబు నెఱిగి చ*రించి మిగుల/ గడనజేసిరి యశమును * గమ్మవారు.
13, మే 2011, శుక్రవారం
వడ్లమూడి గోపాల కృష్ణయ్య Vadlamudi Gopalakrishnaiah
"గీత గోవిందం", "గీత శంకరం", జయదేవ కృతుల వంటి సంస్కృత కావ్యాలను తెలుగు భాషలోకి అనువదించడం అత్యంత సాహసోపేతమైనదని ఎందరెందరో సాహితీవేత్తలు భావిస్తున్న తరుణంలో ఆ ఉత్కృష్టమైన కార్యాన్ని సమర్థంగా పూర్తి చేసి తెలుగు సాహితీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన వాజ్ఞ్మయ మహాధ్యక్ష బిరుదాంకితుడు, కళా ప్రపూర్ణ డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్య.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డాక్టర్ వడ్లమూడి గోపాల కృష్ణయ్యగారు చేసిన సాహిత్య సేవ మరువరానిది. ఎంతో విలువైన సాహితీ సంపదను సృష్టించి మనకందించిన ఆ మహానుభావుని సాహిత్య సేవను భావి తరాలవారికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వడ్లమూడి వారి రచనలు అజరామరమైనవి. అంతటి మహనీయుని గురించి వివరించిన కొత్త కమలాకరం గారికి ధన్యవాదాలు.- డాక్టర్ వడ్లమూడి జయరాజు(రాజేంద్ర)
రిప్లయితొలగించండి