13, మే 2011, శుక్రవారం

సూర్యదేవర సంజీవ దేవ్ Suryadevara Sanjeevdev


డా.సూర్యదేవర సంజీవ దేవ్ (ఆంగ్లం: Suryadevara Sanjeevdev) (జూలై 3, 1924 - ఆగష్టు 25, 1999) ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను తెగిన జ్ఞాపకాలు పేరిట రచించాడు. మంగళగిరి, తెనాలి కి మధ్యన గల తుమ్మపూడి లో 1924వ సంవత్సరం జులై మూడో తేదీన జన్మించాడు.

ఈయన బాల్యంలోనే ఇల్లు విడిచి పెట్టి దేశ సంచారం చేసాడు . 20 ఏళ్ళ లోపలే హిమాలయాలతో సహా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగాడు. చాలా భాషలు నేర్చుకున్నాడు. ఎస్పరాంటో అనే కృత్తిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉన్నది. లక్నో లో అసిత్ కుమార్ హాల్దార్ వద్ద చిత్రలేఖనం అభ్యసించాడు. ఇతని కలం స్నేహం అపరితమైనది. సమకాలీన ప్రపంచ మేధావులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపేవాడు. అమెరికాలోని ఆల్డస్ హక్స్‌లీ నుంచి అమెరికాలో స్థిర పడిన ప్రముఖ చిత్రకారుడు రామారావు వరకూ వారి మిత్ర మండలి సువిశాలమైనది. జిడ్డు కృష్ణమూర్తి నుంచి బుచ్చిబాబు, గోపీచంద్ ల వరకూ వారికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండేవి. రాహుల్ సాంకృత్యయన్ నుంచి బెర్ట్రాండ్ రస్సెల్ వరకూ రవీంద్రనాధ టాగోర్ నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రి వరకూ అధ్యయనం చేయటమే కాక వారితో ఇతనికి మంచి మైత్రి కూడా ఉండేది. ఇతను నివసించే తుమ్మపూడి గ్రామానికి దేశ విదేశాల కళాకారులు, సాహిత్యోపాసకులు వారికోసం వచ్చేవారు. సంజీవదేవ్ వల్ల తెలుగు ప్రాంతం గౌరవం పెరిగింది అని ఆ ప్రాంత ప్రజలు అనేవారు.
మానవతావాది అయిన సంజీవదేవ్ ఏ ప్రాంతమూ పరాయిది కాదు. ఏ మనుషులూ పరాయివారు కారనే వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలోపెట్టాడు. ఈయన 1999 ఆగస్టు 25న మరణించాడు.

ఇతర విశేషాలు

ఇతని పేరు మీద 1999 లో ఈతని సన్నిహితులూ, స్నేహితులూ సంజీవదేవ్ అవార్డును స్థాపించారు. ఇది తత్త్వ, కళా, సాహిత్య రంగాలలో కృషి చేసిన వాళ్ళకు ఇవ్వబడుతుంది.

రచనలు,చిత్రాలు

  • తెగిన జ్ఞాపకాలు. ఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది.
  • రసరేఖలు.
  • కాంతిమయి
  • దీప్తి ధార.
  • రూపారూపాలు
  • సమీక్షా రేఖలు.
  • బయో సింఫోనీ (ఆంగ్లంలో) మొదలైనవి వున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి