13, మే 2011, శుక్రవారం

‘మో’ Vegunta Mohan Prasad



నివాళి
నిశ్వబ్దపు స్వప్నంలోకి....

'ఓ కిరణం పిలుస్తోంది
కళ్ళల్లో సూదులు గుచ్చి
రా రక్షిస్తానంటోంది
చడీ చప్పుడు చేయని
నిశ్శబ్దపు స్వప్నంలోకి

వెళ్తోన్నానని మీరు
మరీ అంత రోదించవద్దు
పీడా ఒదిలిపోయిందని
కాసింత నిదానం పొందండి
నిదానంగా నెమ్మదిగా
వెళిపోతోన్న వాడ్ని
మీరెందుకు పరుగో పరుగో....

నీలి వాయువులో ఆయువు
మునిగిపోయిన లాంతరు
మళ్లీ తెప్పోత్సవం అపుడు
నదిలోకి జారిపోయిన మదిలోంచి
తడవని లాంతరులా
దీపారాధనకి ఒచ్చేస్తానోచ్ ...'

(మో - వీడ్కోలుగీతం)
'మోహన ప్రసాద్ సామాన్య వస్తువుల ద్వారా అసామాన్య సత్యాలను ప్రదర్శిస్తాడు. తన వచన కవితల్లో పార్థివ దృశ్యాల ద్వారా అపార్థివానుభూతులను రేకెత్తింపజేస్తాడ'ంటాడు సంజీవదేవ్ ఒక దగ్గర.
'మో'గా పిలవబడే వేగుంట మోహన ప్రసాద్ వచన కవిత్వంలో దిట్టగా, తనదైన భిన్నమైన ముద్రతో కవితాలోకంలో ప్రకంపనలు సృష్టించి, తాను చదివిన ఆంగ్లసాహిత్యంలోని 'ఇమేజిస్టు ఛాయల్ని' తన తెలుగు కవితల్లో పరోక్షంగా పులిమిన వాడు. కవిగా మార్మికతని, మనిషిగా హాస్యప్రియత్వాన్ని జమిలిగా ఇముడ్చుకున్న మో ఇకలేడన్న వాస్తవం కవితా ప్రియులందరికీ ఒక శూన్య ప్రపంచం.

ఐదేళ్లక్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం (11.6.2006) ఇంటర్వ్యూ కోసం వెళ్లిన యం.డి.యాకూబ్‌పాషాతో 'నేను 'ఫెయిలైనంతగా వేరెవరూ ఫెయిల్ కాకపోవడమే నా సక్సెస్' అంటూ మొదలెట్టి తన 'ఫెయిల్యూర్‌స్టోరీ'ని చమత్కారంగా చెప్పిన మో అంతరంగాన్ని ఇక్కడ యధాతథంగా మరోసారి ఆవిష్కరిస్తున్నాం. అలాగే కొంతకాలం క్రితం మో మాకు ప్రత్యేకంగా పంపిన రెండు కవితల్ని కూడా ఈ సందర్భంగా మీకందిస్తున్నాం.


చితి చింత, బతికిన క్షణాలు, సాంధ్యభాష, కరచాలనం రహస్తంత్రి, నీడలు జాడలు, వెన్నెల నీడలు, పునరపి.. ఇవన్నీ 'మో' పుస్తకాలు. 'మో' ఎంత అద్భుతంగా రాస్తాడో. 'మో' ఎంత అర్థం కాకుండా రాస్తాడో.
కోకిల పాటకు, పక్షికూతకు ఏ అర్థాలు వెదుక్కుంటాము మనం? ఆత్మానందమయ్యేదంతా అర్థం కావాలని లేదు. అర్థమయ్యిదంతా ఆత్మానందానికి దారి తీయాలని లేదు.

* * *

'మో' ఎలాంటి గడుసువాడో!
'నీ నామమెంత మధురం' అంటూ వేనవేల కీర్తనలయ్యే భక్తశిఖామణులను కూడా ఆయన తన వాక్య విన్యాసాల సూదంటురాయి లక్షణంతో దగ్గరికి లాక్కుంటాడు.
ఇలా కూడా పాడిస్తాడు:
'దేవుడు ఉరోసుకుంటాడు
నా తప్పులు క్షమించమంటాడు
నా సామిరంగ
దేవుడోడికి సంకెళ్లు వేసి
నడిబజార్లో నేనుగానీ లాక్కెళ్లుతుంటే
ఆకాశం పక్కున నవ్వుతుంది'

* * *

నేను చీకట్లో మిణుగురుపురుగును. కొంచెం కీచురాయి పురుగును కూడా. చూడండి ఇక్కడ వానచినుకులు కూడా పడుతున్నాయి. అంచేతే కొంచెం కీచురాయిగా శబ్దాలు చేస్తానిక...
నేను కవిగా సక్సెసా? ఫెయిల్యూరా? అని అడిగారు కదా- 'టోటల్‌గా ఫెయిల్యూర్. నేను ఫెయిలైనంతగా ఎవరూ ఫెయిలవ్వకపోవడమే నా సక్సెస్. ఎలియట్ హామ్లెట్ నాటకాన్ని గురించి 'ఆర్టిస్టిక్ ఫెయిల్యూర్' అంటాడు.
కవిత్వాన్ని, జీవితాన్ని వాటి రెండు కొసల్ని కలపలేకపోవడం, వాక్యంలో కో ఆర్డినేట్ క్లాజ్‌ని నిలపలేక పోవడం నా ఫెయిల్యూరే. వివరంగా చెప్పాలంటే- వాస్తవాన్ని, ఆదర్శాన్ని సాహిత్యరూపంలో సమ్మిశ్రమం చేయలేకపోవడం నా వైఫల్యం. వాస్తవం అంటే సామాజిక జీవనవాస్తవం. కవిత్వం ఆ జీవనానుభవాల్ని ప్రజలు మాట్లాడుకునే భాషలో పట్టుకోవాలి.

కవిత్వంలో వాడే పదాలు వట్టి పెదవులనుంచి కాక హృదయంలో నుంచి దూసుకురావాలి. మనం వాడే పదాలు, పదచిత్రాలన్నీ కంటి ముందు రూపు కట్టాలి. నా పదావళి(డిక్షన్) అంతా వైయక్తికం, మానసికం, చదువరితనంలో నుంచి వచ్చినవి. అందుచేత నేను చెప్పిన రెండు అంచులు ముడిపడలేదు. పాఠకులను రీచ్ కాలేకపోయాను. పదబంధాల్ని వాటి అనుశృతమైన బంధాల నుంచి తెగ్గొట్టడం వల్ల, ఎక్స్‌పెక్టెన్సీని నిర్మూలించడం వల్ల అర్థస్ఫూర్తికి విఘాతం కలిగింది అనుకుంటాను.

* * *

నాకు ఇప్పుడు తెలిసివస్తున్న మరో లోపం కవిత్వం ద్వారా ఏ ఉన్నత విలువల్ని, సామాజిక న్యాయాలనూ ప్రవేశపెట్టకపోవడం. ఆయా విలువలపై నాకే గొప్ప విశ్వాసం లేకపోవడం.
కవి అన్నవాడు 'మంచి యన్నది పెంచుమన్నా' అంటూ నిరంతరం అర్దిస్తూనే ఉంటాడు. అంత మంచిలోకం ఎన్నటికీ ఆదర్శప్రాయమే. సాంఘికశాస్త్రాలు, రాజనీతి సూత్రాలు, మతధార్మిక వ్యవస్థలు, సర్వసమానత్వ కమ్యూన్ల సత్రాలు, కవిత్వదర్శనాలు, నూత్న శతాబ్దాలు, వాటి ఏకప్రపంచపు ద్వారాలు అన్నీ కాల్పనికాలే. అందమైన అబద్ధాలే.

మంచి కొంచెం పెరుగుతుందంటే ఈ వాస్తవిక ప్రపంచమే దాన్ని ఎప్పటికప్పుడు తుంచి వేస్తుంటుంది. వాణిజ్యము, వర్తకము, వ్యాపారము, ప్రచారమాధ్యమాలు ఒకదానికొకటి పోటీగా పెరుగుతున్న సమయంలో నా కవిత్వానికి ఒకడే ఒకడు దిక్కు. వాడు ఏకాకి అయిన ఒంటరిమానవజీవి.

* * *

సంస్థల్లో కలవకపోవడానికి గల కారణం గురించి చెప్పాలంటే-
అవి వ్యక్తికి ఈషణ్మాత్రపు విలువా ఇవ్వవు. ఆ మాటకొస్తే ప్రభుత్వమే ఒక సంస్థ. అధికార, ప్రతిపక్షాలు రెండూ సంస్థలే. వ్యక్తి తనలోని సంస్థ ఏమిటో తెలుసుకుంటే, లోనికి చూసుకుంటే చాలేమో అనుకుంటాను.
దళిత, అల్పసంఖ్యాక వర్గాల గురించి నేనేమీ రాయలేదు అని కదా అభియోగం. అన్నిటికీ మూలం అవకాశాలు. ఆ అవకాశాల ద్వారా విద్య, సంస్కారం, వినిమయం, అవగాహన, సహజీవనం, సమ్యక్‌దృష్టి పెంపొందుతాయి.
హైందవ చరిత్రలో అందరికీ అవకాశాలు అందనివ్వలేదన్న మాట వాస్తవం. రాజ్యాంగం ఆ హామీ ఇచ్చింది. కాలక్రమణికలో కాలానుగుణంగా ఆ మార్పుల్ని, చేర్పుల్ని చేసుకుంటూనే ఉన్నాము. కాని ఈ సవరణలన్నీ ఓటు మీద ప్రేమ వల్లే. ఈలోగా సాంఘిక నిశ్రేణిలో పైనుంచి కిందికి, కింది నుంచి పైకీ ఎగుబాట్లలో, దిగుబాట్లలో ఆయా శ్రేణుల వాళ్లందరూ మళ్లీ పూర్వ నేరాలనే చేస్తున్నారనుకుంటాను.

వర్గీకరణలో ఎంత దుర్మార్గపు అంతఃపోరాటాలు అవుతున్నయో! నిజానికి రానున్న రోజుల్లో ఏది అగ్రవర్ణమో, ఏది నిమ్నవర్గమో ఒక్క ఆర్థికస్థితి మాత్రమే తేల్చుతుంది. కేంద్రానికి చెందక, వృత్తానికి అంటుకోక ఇంకా ఎన్ని జాతులు ఉన్నాయో అని నా ఆశ్చర్యం!
'మో' దళితుడుగా పుట్టి ఉంటే అనేది ఉత్త ఊహాత్మక ప్రశ్న మాత్రమే. 'మో' ఒక స్త్రీగా పుట్టి ఉంటే లాంటి ప్రశ్నే. అప్పుడున్నూ ఒక ల్యాంగ్‌స్టన్ హ్యూజ్‌లానో, వోలి సొయంకాలానో, అమెరికన్ బ్లాక్‌పొయెటిస్ మాయా ఏంజెలాలోనో రాసి ఉండేవాడిని (అసలు కవి హృదయం స్త్రీ హృదయమే). అంతేగాని 'మో' మాలగానో, 'మో' మాదిగగానో పేరు పెట్టుకునేవాడిని కాదు.

* * *

'ఉద్యోగం నుంచి రిటైరైనట్లే కవిత్వం నుంచి రిటైరయ్యారా?' అనేది కదా ప్రశ్న-
నాకు ఇప్పుడు అసలొక ప్రధమ పంక్తిని ఎలా రాయలో తెలియడం లేదు. పూర్వం ఏదో పంక్తిని రాసేవాడిని. ఆ తరువాత ఆ పంక్తులే కవితను రాసుకుపోయేవి.
ఇప్పుడు 'కవిత్వం ఎలా రాస్తార్రా?' అని గొప్ప ఆశ్చర్యం నాకు.
ఎక్కడో ఏదో తీగ తెగింది. అలా అని 'బెండయ్య కాపురం'లాంటి రచనేదో చేస్తానని హామీ ఇవ్వలేను. కథ, నవల, నాటక ప్రకియలను టచ్ చేయకపోవడం గురించి చెప్పాలంటే-

కథకు నిర్దేశికత్వం ఉంటుంది. నవలలో నిర్దేశిక విపులత్వం ఉంటుంది. నాటకంలో నిర్మాణసూచికత్వపు స్థిరత్వం ఉంటుంది. జీవితానికి సంబంధించినవాడు ఈ మూడు ప్రక్రియలను ముట్టుకోలేడు. కవిత్వానికి కావల్సిందల్లా ఊహ, అనుభూతి, మానసిక చైతన్యం. కవిత్వం హృదయ సంబంధి. ఆ మిగతా మూడు ప్రక్రియలు అనుశీలనపరమైన మేధోవ్యాపారాలు.
ఎవడికి తెలిసిన జీవితాన్ని గురించి వాడు రాయగలడు. నా జీవితం చాలా హాయిగా ఉంది. లోటు లేకుండా ఉంది. పెద్ద ఛాలెంజెస్ కూడా ఏమీ లేవు. కాబట్టి నేను ఆ మూడు ప్రక్రియలనూ రాయలేను.

* * *

ఉద్యోగం నుంచి రిటైరయ్యాను.
కవిత్వానికి దూరంగా ఉంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని కదా ప్రశ్న-
అనుకోని అవకాశం రాగా ద్రావిడ విశ్వవిద్యాలయంలో ద్రావిడ భాషలను ఒక భాషనుంచి మరొక భాషకి అనువర్తింపజేసే బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం, చిలకమర్తి స్వీయచరిత్రలను ఇంగ్లీష్‌లోకి, ద్రావిడ భాషల్లోకి అనువాదం చేయిస్తున్నాము. ఒక్క సాహిత్య, భాషాశాస్త్రాలే కాక సంస్కృతి, నాగరికత, జానపద విజ్ఞానం, విమర్శ, చరిత్రలకు సంబంధించిన గ్రం« థాలను కూడా అనువాదం చేయించే ప్రణాళిక మాకు ఉంది.

అన్నమాచార్య,క్షేత్రయ్య, కృష్ణశాస్త్రి కృతులను ఆం గ్లంతో పాటు ఇతర ద్రావిడ భాషల్లోకి అనువర్తింపజేస్తున్నాము. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది?' చలం 'మ్యూజింగ్స్' అనువాద క్రియలో ఉన్నాయి. ఇంకా..'కవిత్వ తత్వ విచారము' 'కావ్యానందము' 'కృష్ణదేవరాయలు' 'దేశి' (కోరాడ) 'హంపీ నుండి హరప్పదాక' 'కాటమరాజు కథలు' 'కాశీయాత్రా చరిత్ర'లాంటివి కన్నడంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ అనువాదమైనా మూలభాషలోంచి మరొక ద్రావిడ భాషలోకి వెళ్తుందేగాని రెండు నుంచి మూడు, మూడు నుంచి నాల్గో భాషకు కాదన్నమాట. 20 వ శతాబ్దపు తెలుగు కవిత్వాన్ని ఆంగ్లంతో పాటు తమిళ, కన్నడ, మళయాల భాషల్లోకి తీసుకువచ్చే ప్రణాళిక ఉంది. ఒకే ఒక సమస్య 'వాంటెడ్ గుడ్ ట్రాన్స్‌లేటర్స్'. ఈ 'అనుసృజన' అన్ని భాషల సంగమం. భాషలు వేరుగాని భాషణ ఒకటే. మాకు 'మదర్ టంగ్' ఎంతో 'అదర్ టంగ్' అంతే!

దీంట్లో సక్సెస్ అవుతానా? లేదా? అంటే ఏ 'మో' చెప్పలేను.
కుడి ఎడమైతే పొరపాటు లేదు కదా!
ఉపసంహారం: 'మో' కవిత్వాన్ని అర్థం చేసుకొని ఆనందించేవారి సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువ మంది మాత్రం అత్యంత ఎక్కువగా, పిచ్చిగా 'మో' కవిత్వాన్ని ప్రేమిస్తారు. సదా పెదాలపై నిలుపుకుంటారు.
'కవిత్వాలు ఎలా రాస్తార్రా బాబూ..' అని ఇప్పుడు ఆశ్చర్యపోతున్న 'మో'ను-
'ఇక ముందు కవిత్వం రాయరా?' అని అడిగితే ఆయన చేతిలోకి సిగరెట్ తీసుకుంటూ ఇలా అన్నారు:
'కవిత్వం రాయకుంటే ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నేను కవిత్వం రాయడం ఎందుకు? వారు అర్థం కాలేదు అనడం ఎందుకు? వారికి అర్థం కాలేదని నేను బాధ పడడం ఎందుకు?'

లాటెన్ అమెరికా
విన్న విషయమే ననుకో
బ్యూనస్ ఏర్స్‌లో
వెన్ను జారుతున్నది
వెన్న కరుగుతున్నది
స్పానిష్ బుల్‌ని చూచి
గుండె పిగులుతున్నది.

ఒక విష
దృగ్ విలయాన్ని
వలయ వలయాలుగా
వీక్షిస్తో
క్రూరత్వంలోకి
కూరుకు పో
లేదా సహజ
మృత్యు కాంక్షని
ఎర్ర శాలువాతో
కప్పెట్టుకో.

కన్నీళ్ల కర్చీపుల్ని
చించూ లేదా పంచూ
లేదా చంపూ లేదా చావు.

తుమ్మెదల్లా వాలే
కొకైన్ హెలికాప్టర్ల
చుట్టూరా చేరి
నట్టువాంగం చేయరా
ఎంచేతంటే
విలువలన్నీ కేవలం
వలువలు
ఎంచేతంటే
ఓ పక్షం రోజులు ఆగావా
వక్షాలన్నీ గాలిపోతయ్

శబ్ద స్పర్శ
చెప్పెట్టి కొట్టినపుడో,
ఓ నవ విశ్వాసం
విచ్చుకొన్నపుడో
ఎప్పుడో గానీ
ఎవరోగానీ
హృదయం చప్పుడవుతుంది

చప్పట్లు చరిచినపుడో
రైలు పట్టాలు
చెట్టాపట్టాలు కప్పుకున్నపుడో
ఎప్పుడోగానీ
ఎవరోగానీ
ఉరామరికగా బేరం కుదురుతుంది
(Andhra jyothi-Aadivaaram,14/8/2011)




ప్రముఖ కవి, రచయిత 'మో' కన్నుమూత
విజయవాడ: ప్రముఖ కవి, రచయిత వేగుంట మోహన్‌ప్రసాద్‌ కన్నుమూశారు. 'మో' పేరుతో ఆయన సాహితీలోకంలో సుప్రసిద్ధులు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతునిగా పేరొందారు. పునరపి, రహస్యతంత్రి, నిషాదం, సాంధ్యభాష తదితర ఏడు కవితాసంకలనాలు ఆయన కలం నుండి వెలువడినవే. బతికిన క్షణాలు ఆయన జీవిత చరిత్ర. సాహిత్య అకాడమీకి పలు అనువాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ ఏడాదే ప్రారంభించిన తనికెళ్ల భరణి సాహిత్య పురస్కారం అందుకున్నారు.(ఈనాడు0

' మో' అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె మమత

విజయవాడ, ఆగస్టు 3 : 'నా కోసమని ఏ కోళ్ళూ కూయవు' అంటూ తన రచనలలో పాఠక లోకాన్ని ఆలోచింప చేసిన వేగుంట మోహన్ ప్రసాద్ 'మో' బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడలోని ఒక ్రపైవేట్ ఆస్పత్రిలో అస్తమించారు. కొద్దిరోజులుగా ఆయన అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

మంగళవారం ఉదయం ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు. హైదరాబాద్‌లోని మోహన్ ఫౌండేషన్‌కు తన మూత్ర పిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేస్తానని వారికి మోహన్ జీవించి ఉన్న కాలంలో అంగీకార పత్రం రాసి ఇచ్చారు. ఆయన తుది కోరిక నెరవేర్చడం కష్టమైన పని అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యులకు పూర్తిగా సహకరించారు. మోహన్ కోరిక ప్రకారం దానం చేస్తానన్న అవయవాలను తీసుకోవాలంటే శరీరం, కణాలు పూర్తిగా నిర్జీవం కాకూడదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో మోహన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు సమ్మతితో తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు ప్రత్యేక సర్జరీ ద్వారా మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు తొలగించి భద్రపరిచారు.

నేత్రాలను మాత్రం నగరంలోని ఐ బ్యాంక్‌కు ఇచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్ళారు. తొలగించిన అవయవాలను నాలుగు గంటల లోపే వాటిని తిరిగి అవసరమైన వ్యక్తులకు అమర్చ వలసి ఉంటుందని మోహన్ ఫౌండేషన్ సీఈవో రఘురామ్ చెప్పారు. మోహన్ ప్రసాద్ తుది కోరికను అవయవ దానానికి మన స్ఫూర్తిగా గుండె నిబ్బరంతో అంగీకరించిన ఆయన కుమార్తె మమతకు ఫౌండేషన్ తరఫున రఘురామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో కన్నీళ్ళ పర్యంతమైన మమత గద్గద స్వరంతో మాట్లాడుతూ, తన తండ్రి ఆశయం వల్ల నలుగురు వ్యక్తులు ఆరోగ్యవంతులు అవుతున్నారన్న ఆనందం తన బాధను అణచుకునేలా చేసిందని చెప్పారు. తన తండ్రి గొప్ప కవి మాత్రమే కాక మానవీయత మూర్తీభవించిన మహానుభావుడని ఆమె అన్నారు. తన తండ్రి అవయవాల ద్వారా ఆరోగ్యం పొందిన వ్యక్తులలో ఆయనను చూసుకోగలుగుతానని, ఆయన మరణించినా జీవించి ఉన్నట్టుగానే తాను భావిస్తానని మమత పేర్కొన్నారు

ప్రముఖులు, కవిమిత్రుల నివాళి
ఆస్పత్రిలో మోహన్ అవయవ దానం పూర్తి అయిన అనంతరం బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆయన భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగించారు. ఆ తరువాత జర్నలిస్టు కాలనీలో ఆయన సొంత ఇంటికి తీసుకువచ్చారు. కవి మిత్రులు మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు గుత్తికొండ సుబ్బారావు, జి.వి.పూర్ణచంద్, ఇతర కవి ప్రముఖులు శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు, కె.శివారెడ్డి, ఆర్.కె.రమణ జీవీ., ఖాదర్ మొహియుద్దీన్, తిరుపతిరావు, డాక్టర్ వి.చంద్రశేఖరరావు, సీతారామ్, శిఖామణి, జుభాష్‌విల్లి, సురేంద్రరాజు, సిద్ధార్థ, చలసాని ప్రసాద్, సి.ఎస్.ఆర్.ప్రసాద్, రుక్మిణి, సిద్దార్ధ అకాడమీ కార్యదర్శి నాగళ్ళగురు ప్రసాదరావు సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దిక్షితులు తదితరులు ్‌మో* భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలు సమర్పించి నివాళులు అర్పించారు.

అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె
వేగుంట మోహన్ ప్రసాద్‌కు కుమారులు లేకపోవడంతో ఆయన ఏకైక కుమార్తె మమత తండ్రి భౌతిక కాయానికి సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు. మమత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మోహన్‌కు భార్య ఉన్నారు. మోహన్ ప్రసాద్ సోదరుడు ఆమెరికాలో ఉంటున్నారు.
(ఆంధ్రజ్యోతి)

The voice from within

Neeraja Murthy
(The Hindu, July21,2011) 

 
Poet Vegunta Mohan Prasad. Photo: Nagara Gopal
Poet Vegunta Mohan Prasad. Photo: Nagara Gopal
Vegunta Mohan Prasad, popularly known as ‘Mo' was recently awarded the Tanikella Bharani Sahitya Puraskaram-2011.
There is a lot of hustle-bustle in the third floor apartment of Rise ‘n' View apartments on Road No. 3 in Banjara Hills. Vegunta Mohan Prasad, popularly known as ‘Mo' is making a few telephone calls before he makes himself comfortable for a chat with us. In a crisp white kurta and trousers, 60-plus ‘Mo' looks the poet, teacher and translator that he is. The buzz is all due to the special celebrations at home; ‘Mo' was recently awarded the first Tanikella Bharani Sahitya Puraskaram- 2011 for his book Nishadam on the occasion of actor, writer and director Tanikella Bharani's birthday.
‘Mo' attributes his discipline in studies to his father. When he enrolled himself for a diploma course in Central Institute of English and Foreign Languages (now English and Foreign Languages University), he was exposed to literature and this enhanced his skills in interpretation of literature. His writing career began while he was in his graduation. “My first poem was published in '60 in a magazine called Bharati. Myteachers openly congratulated me in the class,” he says. Greatly influenced by British, French and Russian literature through English, ‘Mo' talks highly of the Russian author Fyodor Dostoevsky especially his Crime and Punishment.
Pioneering postmodern poetry and literary criticism, ‘Mo's' poetry knows no bounds. Unabashedly complex and innovative, it is inspired by the joys and sorrows and ups and downs of life. “Telugu readers were used to a kind of language; this had become like a habit,” he says. So when he tried to break this ‘habit' with his experimental poetry, the feedback was not so good. “Style is in my mind,” he says with a laugh and continues, “I expect my readers to be intelligent. I don't play for the gallery and I am not reading out from a mushaira. I play crude and rude.” His poetry evoked mixed reactions and ‘40 accusations' against his writing which he listed in a book. ‘Mo' calls himself ‘sickly cynical, who has lost faith in everything. My books don't sell. I am not a good salesman.”
‘Never scared or angry', he published seven volumes of poetry, three books on literary appreciation and several translations for Sahitya Akademy, in the last four decades. After superannuation, he also worked as director, Translation bureau, Dravidian University, Kuppam for three years and received several awards and honours. For his readers, there is good news. Oxford University Press (Madras) is bringing out a Telugu Novel, his translation Swarajyam in September.

Mohan Prasad gets Tanikella Bharani Puraskaram


  15 Jul 2011
HYDERABAD: Vijayawada- based retired English lecturer Vegunta Mohan Prasad was awarded the first Tanikella Bharani Sahitya Puraskaram- 2011 on the occasion of film actor, writer and director Tanikella Bharani’s birthday at a function organised by the Kala Foundation at Ravindra Bharathi here on Thursday.
Mohan Prasad was given a cash award of Rs 50,000 and felicitated by Tanikella Bharani and eminent poets, writers and film stars. He was given the award for his poetry (vachana kavita sankalanam) ‘Nishadam’ which was selected by a jury consisting of three members.Speaking on the occasion, Dr C Narayanana Reddy said, “Bharani loves all forms of art and particularly poetry. He himself is a good poet. By felicitating fellow poets, he awarded himself.” Former chief minister K Rosaiah appreciated Bharani and said felicitating poets will bring back the glory of Telugu literature and culture.Speaking on the occasion Tanikella Bharani said: “These days there is no encouragement for poets. I want to support young writers. All good poets should be felicitated.” The film actor said he would continue to present the award on July 14 every year to honour the best poet of the year.Actors Brahmanandam, Prakash Raj, director Trivikram Srinivas, lyricist Vennalakanti and other film personalities were also present. Earlier, an ‘Ashthavadanam’ was performed by Avadhani K Srivirinchi.

 

Sandhya Bhasha - Vegunta Mohan Prasad

(Vijayagopal -  Lokabhiramam)

Sri Vegunta, also called  'Mo' is a senior Telugu poet.
He treads the path of complexity in his poetry.
It fell on me to review his book 'Sandhya Bhasha' for Indin Literature.


You can read review  at
http://vijagopalk.tripod.com/id74.html

That is not the point here!

I was told that Mo is a fire brand personality and all the people tread carefully when it is him!
I could not help!
The review was published.

After some time later, I get a call from Pasupuleti Poornachandra Rao, a friend and  man of many shades!
Mo is coming to Hyderabad and would like to meet me!
I am told that after the review he was trying to get in touch with me.
Since I am a nobody, he could not make much headway!
He was, now, staying with Pasupuleti and they discovered that I could be met!

I went there for a lunch.
I was surprised by the love Mo showered on me.
He said, mine was the best of reviews about his works!
He also asked me to write more for an upcoming publication about him.
He was in the city to attend a programme of Pathabhi another genius film maker and poet!
I joined them and the meeting was very interesting.
Later I have not heard anything from Sri Vegunta.

Now, a couple of his poems for your reading pleasure.



Mo is a seasoned English language expert and teacher.
Trying to translate him will be a cruel joke!
There is nothing wrong in trying after all!!

The poem's title is very much like him!
the last two words mean the same!

Down up and above

A high song of nether worlds sorrows
Come up and slowly
Shining
Like a great last truth

On the lone stone upon the high mountain
Turning into a diamond like the smile of death
In the paths of cracked feet
morning Sun getting stuck

Would at least one drop spill
From the last cold dance of the moon
With stretched hands for millenia
We keep seeing shivering in cold
***



Dog

Dont just knock on the door like that
There are none who would shudder
Aye
Mad fellow disembark from the train however
Would hand the ticket and get into a rickshaw
After all
Who gave the idea to you
That there would be grain in meditation
Along you
A cobweb pant and for you great self
A dsire for salvation
Just now
I'll leave for the village how many of them
Every moment stepping up and down teh entrances you mad
***

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి