13, మే 2011, శుక్రవారం

సూర్యదేవర రాఘవయ్య చౌదరి Suryadevara Raghavayya Chowdary


శ్రి సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారు 1876 సంవత్సరంలో జన్మించిరి. వీరి తండ్రి నాగయ్య, తల్లి రుక్మిణమ్మ. వీరి స్వగ్రామము కొల్లూరు. వీరిద్దరు అన్నదమ్ములు. రాఘవయ్య చౌదరి గారు అందు పెద్దవాడు. తురుమెళ్ళ గ్రామవాసియగు యలమంచి భగవాన్లు గారు వీరి మేనమామ. అచటనే నాల్గవతరగతి వరకు అనగా ప్రబంధకావ్య పఠనమునకు విద్య నభ్యసించిరి.
ఇంటిపేరు సూర్యదేవరవారగుట వలనను, చిన్నప్పటినుండి సూర్యవంశీయులమనియు, ప్రత్యేకసథాన గౌరవమున్నదనియు తమ వ్యక్తిత్వనిరూపణకు చిన్నప్పటినుండియు సాంఘికసేవలో నిమగ్నులై యుండెడివారు. మేనమామ భగవాన్లుగారి సలహాననుసరించి సంగంజాగర్లమూడి గ్రామకాపురస్థులు శ్రీ కోనేరు సూరయ్యగారి కుమార్తె చి.సౌ. కాంతమ్మగారితో వివాహము జరిగినది. కాని సంతానము కలుగలేదు. తమ్ముని కుమారుడు నాగేశ్వర రావును దత్తత చేసుకొని బి.ఏ వరకు చదివించిరి. శ్రీ కేసరనేని అంకినీడుగారి కుమార్తె చి.సౌ. పుష్పావతిని నాగేశ్వర రావునకిచ్చి వివాహము గావించిరి. పెండ్లిచేసిన కొలదికాలమునకే రాఘవయ్య చౌదరి గారు మార్చి 1936లో దివంగతులైరి.
జీవిత విశేషములు - రచనలు:
రచనలు ;-
౧. విప్రచరిత్ర.
౨. ఆర్యకవి కుతంత్రము.
౩. బ్రాహ్మణేతరోద్యమ చరిత్ర.
౪. కమ్మవారి చరిత్ర.
బ్రాహ్మణేతరోద్యమము:
రాజకీయములో బ్రాహ్మణులకుతప్ప, యితరకులస్థులకు స్థానములేకపోవుటవలన రాజ్యాధికారము జేపట్టుటకు ప్రత్యేకోద్యమము పానగల్లు మహారాజాధిపత్యయమున ఉమ్మడి మద్రాసురాజధానిగ నున్నప్పుడు జస్టిస్ పార్టీతో నడుపబడినది.
దానికి అండగా, సాంఘికవ్యవస్థలో అగ్రకులముగ నున్నబ్రాహ్మణులకు తప్ప యితరకులజులకు స్థానములేకపోవుటచే జి.ఎస్.పి. సరస్వతి(నెల్లూరు) స్వాములవారి బోధననలననుసరించి, స్వసంఘ పౌరోహిత్యము, దాని చిహ్నముగ యజ్ణోపవీతము ధరించుట, గాయత్రీ మంత్ర పఠనము చేయుటమొదలగునవి హిందూమతశాస్త్రము ననుసరించి ఒక బ్రహ్మాండమైన ఉద్యమము లేవదీసి ఆంధ్రదేశములో వాడవాడలా, వేదములు చదువుటకు అన్నివర్ణములకు హక్కుకలదని ఉపన్యాసములిచ్చుచు, బ్రాహ్మణ సహాయనిరాకరణోద్యమము సల్పుచు స్వసంఘ పౌరోహిత్యము, ప్రత్యేకముగ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి మండలములలో స్వసంఘములు నెలకొల్పిరి. కాని వ్యక్తిగతముగ ఏయొక బ్రాహ్మణుని ద్వేషించువాడుకాదు. దీనికి తార్కాణము రెండవసారి ఆయన గ్రామ ప్రెసిడెంటు పదవికి కేశరనేని అంకినీడుతో పోటీచేసినప్పుడు వైదిక బ్రాహ్మణులే వారిని బలపరచిరి.
కొల్లూరు గ్రామమునకు 18-12-1920 నుండి ౨29-10-1922 వరకు, తిరిగి 16-12-1929 నుండి 16-8-1932 వరకు గ్రామ చైర్మెనుగ ఐదుసంవత్సరములకాలము పనిచేసిరి. వీరికాలములో మంచినీటిచెరువు మరమ్మతు చేయించుటయేగాక, పశువులు దిగకుండ కట్టుబాటు చేయించి, స్నానములుచేయుట, గుడ్డలుతుకుట నిషేధించిరి. కాల్వలలో నేర్పాటుగావించిరి.
మురుగుకాల్వలు త్రవ్వించుట, కలరా మశూచి వగైరా వ్యాధులు వచ్చినప్పుడు తాముగా నాయకత్వము వహించి, చ్ందాలు ప్రోగుచేసి వ్యాధి నివారణకు అపారసౌకర్యములు ప్రత్యేక పల్లెలకు కల్పించుటవల్ల కాబోలు యిప్పటికిని చెయిర్మెన్ రాఘవయ్యగారనెడి పేరుతో వ్యవహరింపబడుతున్నది.
సహాయ నిరాకరణోద్యమము రోజులలో బడులు మూయించు రోజులలో విద్యాభ్యాసము కుంటుపడునని తలంపుతో విద్యార్ధులను ప్రోగుచేసి, ఉపాధ్యాయులకండగానిల్చి, పాఠశాలలు నడిపించినారు. సంపన్న కుటుంబీకుడు గాకపోయినను బీదవిద్యార్ధులకు తమ యింటియొద్ద ఉచిత వసతి గల్పించి, తాము దగ్గర కూర్చొని, నిర్ణీతకాలము ప్రకారము విద్యార్ధులు చదువుకొనునట్లు క్రమశిక్షణలో నుంచెడివారు. వారి భయ భక్తులవలన యస్.యస్.యల్.సి. పరీక్షలో చాలమంది విద్యార్ధులు కృతార్ధులగుచుండెడివారని ఇప్పటికిని చెప్పుచుందురు.
స్వసంఘ పౌరోహిత్యస్థాపనవలనను, సాంఘికసేవవలనను ఆంధ్రరాష్ట్రములో వారిప్పటికిని చిరస్మరణీయులై యున్నారు.
రచన: కొత్త నాగేశ్వర్రావు చౌదరి.
(తణుకు నరేంద్ర సాహిత్య మండలి వారిచే1973 సంవత్సరంలో ప్రచురితమైన సూర్యదేవర రాఘవయ్య చౌదరి గారి రచన ‘కమ్మవారి చరిత్ర’ గ్రంధము నుండి......)

-----------------------------------
బ్రాహ్మణేతర విజయము
గ్రంధకర్త:
సూర్యదేవర రాఘవయ్య చౌదరి
కొల్లూరు.

తెనాలి
రైతు ముద్రణాలయమునందు ముద్రించి
ప్రకటింపబడియె.

..................
ప్రధమ ముద్రణము 1000 ప్రతులు.
...................
1925

వెల ౦-12-౦ ] [కాపీరైటు రిజిష్టర్డు.



ఈ ప్రాచీన గ్రంధమును సేకరించి, ప్రస్తుత ఈ రూపమిచ్చినది:
కొత్త కమలాకరము
కొత్త రాజేష్
.................................
అంకితము
..........


స్వార్ధత్యాగులై బ్రాహ్మణేతర సౌభాగ్యమే తనపరమావధిగానెంచి, జీవిత సర్వస్వమును బ్రాహ్మణేతరోద్యమమునకు ధారవోసిన బ్రాహ్మణేతరోద్యమ స్థాపనాచార్యులైన కీర్తిశేషులగు డాక్టరు టి. మాధవనాయరుగారి యాత్మశాంతికై యీచిన్ని పొత్తము నంకిత మొనర్చుచుంటి.
ఇట్లు
గ్రంధకర్త.
.............................................................................................
విజ్ఞప్తి
సత్యాసత్య విమర్శకులారా!
శ్రీమత్పరమహంస గోపాల సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి స్వాములవారు క్రీ.శ. 1916
వత్సరారంభమున కమ్మ, రెడ్డి, వెలమ, బలిజ, శాఖలవారు శూద్రులను నూహతో వేదాధికారము గలదని కొల్లూరునందు వాదనజేయు తరుణమున కమ్మ, రెడ్డి మున్నగు శాఖలవారు శూద్రులుగారనియు క్షత్రియులనియు నేవచింప శ్రీ స్వాములవారికిని నాకును యందును గురించి కొంతచర్చ జరిగిన పిమ్మట యాశాఖలవారు క్షత్రియులను నావాదనను శ్రీస్వాములవారంగీకరించి వారును కొన్ని గ్రంధములు పరిశీలన జేసి జయార్ధ ప్రకాశిక ౩వ భాగమున నాశాఖలవారు క్షత్రియులని నిరూపించినారు. నేను కమ్మవారి చరిత్రనువ్రాసి సోదరుల కర్పించుకొంటి. యాగ్రంధ ద్వయము ననుసరించి తగు చర్చలో సిద్ధాంతపర్చుకొను తలంపుతో బ్రాహ్మణానుకూలురగు కమ్మవారు కొందరుభయ పార్టీలను కోరినందున శ్రీపుష్పగిరి పీఠమువారికిని మాకు నాల్గుదినములు కొల్లూరునందు వాదప్రతివాదములు జరిగినవి. యావాదనలో మావాదనను త్రోసివేయజాలక అఖిల పీఠాధిపతులకు దెల్పి వారి యభిప్రాయమును తీసికొని తమ యభిప్రాయమును లిఖిత పూర్వకముగ నైదు మాసములలో దెల్పెదమని పీఠమువారు జెప్పిరి.
ఇంతవరకు పది మాసములు గతించినవి. మావాదము నంగీకరించుటయో లేక ఖండించుటయో యింతవరకు జరిగియుండలేదు. అదియటులుండ కొల్లూరు పురమున జరిగిన వాద ప్రతివాద మనునామముతో యొకపొత్త మచ్చొంచి యాగ్రంధమును నిగూఢముగ తమ కనుకూలురగు వారికి పంచిపెట్టుచున్నారు. ఆగ్రంధము కొల్లూరు నివాసులగు బ్రాహ్మణోత్తముల సహాయంబున మాకొక ప్రతి లభించినది. అట్లు లభింపజేసినవారికి నా వందనములు.
ఆగ్రంధమున దమ యభిప్రాయమును తెల్పి సిద్ధాంతమొనర్చక సభలో జరిగినవికొన్ని లేనివికొన్ని చేర్చి వ్రాసి పండితాభిప్రాయము నర్ధించియుండిరి. అటుల లేని విషయంబులు కొన్ని చేర్చుటచేతను కమ్మ, వెలమ, రడ్డి, బలిజ, శాఖలవారు అనులోమ సంకరులని నూతనముగ ప్రమాణమును కల్పించి యందువ్రాయుటచేతను అందలి సత్యము నస్మత్సోదరాగ్రేసరు లందరికి దెలియచేయుట కర్తవ్యంబగుటచేతను మదీయ విద్యావిహీనతనైన గమనింపక “బ్రాహ్మణేతరవిజయ”మను నామముతో నీగ్రంధమును పాఠక మహాశయుల కర్పించుకొనుటకు సాహసించితిని.
ఈగ్రంధమున కొల్లూరునం దుభయ వాదములు ప్రధమ భాగముగను, శ్రీపీఠమువారు కల్పించినయుభయవాదన ద్వితీయ భాగముగను, యాద్వితీయ భాగ విమర్శనశాస్త్రీయోపన్యాస విమర్శన తృతీయ భాగముగను, బ్రా.ఇ.ల నధోగతి పాల్జేయుటకునై గావించిన బ్రాహ్మణ కల్పిత విషయములు చతుర్ధ భాగముగను, కమ్మ, రెడ్డి, వెలమ, బలిజ శాఖలవారి చరిత్ర సారాంశము పంచమ భాగముగను, విభాగించి వ్రాసితి.
ఇందలి సత్యాసత్యముల నారసి కృపతోదెలుప పాఠకోత్తములే కర్తలు. అట్లు తెలిపిన విషయములలో సవరించుకొనవలసిన యంశములున్న తలయొగ్గి సవరించుకొందునని వినయపూర్వకముగ తెలుపు కొనుచున్నాను. ఇందు ప్రధమ భాగములో చేర్పవలసిన ముఖ్యవిషయములను శ్రీమత్సరమ్హంస స్వామి జి.ఎస్.బి. సరస్వతిగారి యొక్క ఉపన్యాసము లభింపమిచే చేర్చలేదు. శ్రీయుత బారిష్టర్ శతావధాని త్రిపురనేని రామస్వామి చౌదరిగారి యుపన్యాస సారముమాత్రము అచ్చు పూర్తియయిన పిమ్మట లభించుటచే వేరుగా కూర్చుట గల్గినది. నాల్గవ భాగమున బ్రాహ్మణేతరులు విద్యా ధనగౌరవాదుల పొందుటను గురించి జపతప యజ్ఞయాగాది క్రతువులు సేయుటను గురించి యనర్హులని బ్రాహ్మణుల శాసనములు దర్పణముభాతిగన్పట్టుచున్నవి గదా ఇట్టి స్థితిలో రాజ్యాంగము వారి నిరంకుశత్వము రూపుమాపయత్నించుచున్న యిక్కాలమున బ్రాహ్మణుల నిరంకుశత్వమును రూపుమాపి బ్రాహ్మణేతరులకు మనస్వతంత్ర్యత సంపాదింపబూనుట దేశానర్ధకమను నవ్యక్తపు వాదన జనించుటకు హేతువెద్దియో నిరూపించజాలకున్నాను.
అయితే యితరులువచ్చి దేశమనేడి గృహమున కగ్ని ముట్టించు చుండిరని యొప్పుకొందము. ఈబ్రాహ్మణులు చేయు ఘనకార్యమేమి? దేశమనెడి గృహమున కల్పత్వ నీచత్వముల నారోపించి బడబాగ్ని ముట్టించినారు. విదేశీయులగ్ని ముట్టించుట కంటె స్వదేశీయులు బడబాగ్ని ముట్టించుటతిఘోరము. రాజ్యాంగమువారి చైదములగ్నివంటివైన బ్రాహ్మణుల చర్యలు బడబాగ్నివంటివనుట నిర్వివాదాంశము. ఎటులనగా
రాజ్యాంగమువారు } బ్రాహ్మణులు
విదేశీయులు } స్వదేశీయులు
అన్యమతస్తులు } ఏకమతస్తులు
నిరంకుశత్వము రాజకీయ } నిరంకుశత్వము సాంఘిక ఆర్ధిక
ములకు మాత్రమే} రాజకీయాదులయందు
ఈ పైవిషయయంబుల పరిశీలించి నాల్గవభాగము పఠించినవారికి బ్రాహ్మణుల శాసననిరంకుశత్వమే హెచ్చని సుభోదకంబగును. అందుచే బ్రాహ్మణేతర మనస్వతంత్ర్య తనపహరించి సాంఘిక ఆర్ధికాది విషయంబులలో ననర్హుల చేసిన బ్రాహ్మణులచర్యలు బడబాగ్నివంటివనుట చెల్లును. ఈపొత్తమున బొందుపఋపబడిన బ్రాహ్మణకల్పిత ప్రమాణములు బ్రాహ్మణేతరుల నెంత యల్పత్వ నీచత్వములకు బాల్పడచేసి యఖిలసంపదల కనర్హులగావించినది దర్పణము భాతిగన్పట్టుచున్నయది. భారతీయులలో జనసంఖ్యయందు 100 కి 97 రుగలబ్రాహ్మణేతరసంఘమును 100 కి 3 రు గల బ్రాహ్మణసంఖము యివ్విధి నల్పత్వ నీచత్వములకు బాల్పడజేసియుండ తన్నివారణ జేయుటవసరము. స్వరాజ్య సంపాదనమాత్రము చేయుదమనుట యనాలోచితము. అల్పత్వనీచత్వముల నంగీకరించిన యగౌరవాపేక్షపరులు రాజ్యసంపాదన జేయుటయు సున్నయే. అధవా గల్గినను స్థిరముగా నిల్చుటయు సున్నయే. మేమిటుల వ్రాయుట స్వరాజ్యమక్కరలేదనుటకుగాదు. స్వరాజ్యసంపాదనతో బాటు సాంఘీకాది విషయంబులలో మనోస్వాతంత్ర్యతను సంపాదించి యింతదనుక నారోపింపబడిన యల్పత్వ నీచత్వములను హరింపజేసి ఆత్మగౌరవాభివృద్ధి గావించుకొనవలెనని మాతలంపు. ఇట్లు బ్రాహ్మణేతరసంఘము సాంఘికసత్వసంపాదన జేయుట ముఖ్యమని ఆంధ్రపత్రికయు వచింపుచున్నది. యావాక్యముల నీక్రింద పొందుపరచెద చిత్తగింపుడు.

“సాంఘికార్ధికాదుల విషయమై బ్రాహ్మణేతర సంఘము నిరంతరము దేశక్షేమమునకై కృషిజేయవలసియున్నది.
బ్రాహ్మణేతరోద్యమమును తిన్నగనడుపుచొ నెట్టియాక్షేపణ యుండజాలదు. ఏలనన ప్రజాసామాన్యమునందు యధిక సంఖ్యాకులు బ్రాహ్మణేతరులగుటచే వారి అభ్యుదయమే హిందూదేశాభ్యుదయమగును. ఇంతకన్నను కావలసినదేమిగలదు? బ్రాహ్మనేతరోద్యమము రాజకీయరూపముదాల్చక సంఘోద్ధరణకై కృషిసలిపియున్నచో అయ్యది దేశమున కమూల్యమైన లాభమును కలిగించెడిది. నానాటికి కృశింపుచున్న సంఘమతసంస్కరణములకు తప్పక ప్రోద్బలము కలిగించియుండెడిది.
బ్రాహ్మనేతరులను ఆర్ధికముగనేమి సాంఘికముగ నేమి బైకి దెచ్చుటకీయుద్యమము దేశమునకు లాభము కలుగుననుటకు సందియములేదు."
ది 26-4-1925 ఆంధ్ర దినపత్రిక.
ప్రధానవ్యాసము.

చదువరులారా. విప్రవిచేష్టితము చూచినను ఆంధ్రపత్రికాభిప్రాయమును చూచినను సాంఘిక సత్వసంపాదనకునై బ్రాహ్మణేతరోద్యమము ముఖ్యమని సుబోధక బగుచున్నది. యీసన్మార్గమును గనిపెట్టియె జస్టిసుపార్టీకన్న నొక వత్సరముముందు బ్రాహ్మనేతరోద్యమమును జనింపజేసి యిల్లు వల్లు గుల్ల యయినను నాసదుద్యమాభివృద్ధికి నిరంతరము సేవచేయుచున్నాను. ఇయ్యదియామోదనీయమని సర్వేశ్వరుడుతో పచేసిన స్వీకరింపుడు లేకున్న విసర్జింపుడు. గాని మంచిచెడ్డలను విమర్శించి కర్ణుని జన్మకధను గోప్యముజేసిన కుంతివలె గోప్యము చేయక తెలుపుటకు వినయముతో వేడుచున్నాను.
శ్రీపుష్పగిరి పీఠమువారు కమ్మ,రెడ్డి,బలిజ,శాఖవారిని గురించి నవీన కల్పనలతో బహు నిందాస్పదముగ వ్రాయుటజూచి సహించలేని నాపామరత్వముచే నేనుకూడా కొన్నితావుల వారిని గురించి తూలుగ వ్రాసితి. ఆకారణమున నావాదనను త్రోసివేయక కౌరవసభలో ద్రౌపది ప్రశ్నకు మౌనము వహించిన భీష్మాదికురువృద్ధులవలె మౌనము ధరించక యిందలి మంచిచెడ్డలను విమర్శించి నిరూపించ పాఠకోత్తముల మరి మరి వేడుచుంటి.
ఈగ్రంధ ప్రచురణకు సర్వవిధముల సహాయము చేసిన మాదల రామయ్య చౌదరిగారికిని, ఈగ్రంధము వ్రాయుటకు కోరిన గ్రంధములనొసంగిన కొల్లూరు విద్యార్ధి బృందమువారికిని, విశ్వబ్రాహ్మణ బాలసమాజమువారికిని నాకృతజ్ఞతావందనములు. మాసాంఘికోద్యమమును సోదర ప్రేమతో గౌరవించిన జస్టీసు సంఘమువారికి నావందనములు.
ఇట్లు“ స్వకార్యహానికి జంకక నిందలి తప్పులను సవరించి శుద్ధప్రతి వ్రాసియిచ్చిన విద్వాన్ తాళ్ళూరి రాఘవయ్య చౌదరిగారికిని ఆయా భాగముల కనువగు నర్ధములుగల పద్యముల నొసంగిన శ్రీయుత బాలకవి అష్టావధాని కొసరాజు రాఘవయ్య చౌదరిగారికిని కృతజ్ఞతానేక వందన శతంబులు సమర్పించు”

కొల్లూరు } గ్రంధకర్త,
తెనాలి తాలూకా } సూర్యదేవర రాఘవయ్య చౌదరి
గుంటూరు జిల్లా }
------------------------------------------------

త్రిపురనేని రామస్వామి చౌదరి,
శతావధాని గారి,
ప్రతివాదము.
...........-............

1. నిజముగ సద్బ్రాహ్మణులకుగాని, సుక్షత్రియులకుగాని యుపనామములయిన శర్మ, వర్మ శబ్దములు మున్నెన్నడు తగిలించుకొనియుండెడి యాచారము లేదు. నిస్సారులై యాచారవ్యవహారాదులచే గుర్తింపబడరేమో యను శంకచే ప్రేమతోనైన గుర్తింపబడుటకు నీదారిత్రొక్కిరి. ఇందుచేతనే ద్రోణశర్మ యనిగాని వసిష్టశర్మ యనిగాని దుర్యోధనవర్మ యనిగాని భీష్మవర్మ యనిగాని లేదు. సుక్షిత్రియత్వము శంకాస్పదమైన కృతవర్మకే వర్మయను నామము కలదు. ఇంతమాత్రముచే వసిష్టాదులను బ్రాహ్మణులు కారనియు, దుర్యోధనాదులను క్షత్రియులు కారనియు జెప్పదగునా? నిజముగా చైనులుగారి తండ్రికి చైనులుగారని యుపనామము లేదు. అంత మాత్రముననే చైనులు చైనులు తండ్రి కుమారుడు కాడని చెప్పదగునా? న్యాయమగునా? వీరికి నుపనామములుగా నున్ను నేడు నీడు రాయణ రెడ్డి మొదలగు నామములే క్షత్రియత్వ సూచకములు.

2 . ముక్త్యాల జమీందారు తాను విష్ణుపాదోద్భవుడనని తాగృతిపొందిన గ్రంధములో వ్రాయించుకొన్నాడు. కావచ్చును. అంత మాత్రముననే మావాదమునకు నష్టమేమో బోధపడదు. విష్ణుపాదోద్భవులు క్షత్రియులు కారనియు, శూద్రులేయనియు, నెచ్చటను చెప్పబడియుండలేదు. ప్రజాపతి పాదములయందు శూద్రులు పుట్టినారని చెప్పబడియున్నది. కాని విష్ణు పాదమునందనికాదు. ఒకవేళ నట్లున్నచో ప్రజాపతియు, విష్ణువును తన్నులాడుకొని, నిశ్చయము తేల్చుకొన్నప్పుడాప్రసంగము చేయవచ్చును. ముక్త్యాల జమీకి మాతృస్థానమయిన నమరావతి దేవాలయములో నొక శిలాశాసనమున్నది. అందీ పద్యమున్నది.
ఉ. రాజిత కీర్తిశాలురు కరంబున గమ్మకులోద్భమల్ భర
ద్వాజ మునీంద్ర గోత్రీజులు......................
దీని కర్ధమేమి చెప్పవలయు.

3 . క్షత్రియులైనచో క్షత్రియా శౌచవిధియే వీరాచరించుచుండెడివారట. అగుచో, శూద్రులకు స్మృతులు ముప్పది దినముల శౌచవిధి చెప్పుచుండగా వీరు ౧౫ దినములే యవలంబించు చున్నారు. ఇది యెట్లు?

4 . కూర్మ శబ్దభవము కమ్మకాక కుమ్మరేయగుచో విప్రశబ్దము, ఉప్పరయేల కాకూడదు.

5 . స్కాంద పురాణములో జాతిభేదము గలవానికి గూర్చి చెప్పబడినది కాని వేరుకాదు. అయ్యది యచ్చట నొసగబడిన యుదాహరణనుబట్టి స్పష్టము కాగలదు. గాడిద గుర్రము కానేరదు గాని చెడిపి గుర్రము మంచిగుర్రమేలకాదొ, మంచిగుర్రము చెడిపియేలకాదో బోధపడదు? మానవులందరు నొక్క ప్రజాపతినుండియే యుద్భవించినప్పుడు జాతిభేదమెట్లు వాటిల్లి నదో చెప్పుటయయితికాదు. ఎల్లరును మనుసంతానమగుటచేతనే మానవశబ్ద వాచ్యులైరికదా? గుర్రమును గాడిదను నేర్పరుపగలముకాని మనుజులయందు చూచి చూచుటతోడనే వర్ణవిభాగము చేయలేముగదా.

6. ఒక్క జన్మమునందే వర్ణాంతరమును బొందిన మహానుభావులు భారత భాగవతమునందలి వంశవృక్షమును పరీక్షించి చూచిన యెడల బోధపడగలదు. కుటుంబములు, కుటుంబములు వర్ణాంతరమును బొందినట్లు గన్పట్టు.

7. జర్మనులు, మహమ్మదీయులు హిందువులుకారు. హిందువులనుగూర్చి యేస్మృతులు వాకొనినవి. ఇట్టి సందర్భములో హింద్వేతరులను గూర్చి మాటాడుట యవివేకము.

పెక్కుమాటలేల? ఏనాడు బ్రాహ్మణులు రెడ్డి, వెలమ, కమ్మ ప్రభ్రుతులచే పరిపాలింపబడుచున్న తెలుగుదేశమున కాపురము చేయుట కారంభించిరో, యానాడే పైవాకొనబడిన జాతులు క్షత్రియ శాఖలైనను కావలయును, లేదా బ్రాహ్మణులు, బ్రాహ్మణులైనను కాక పోవలయును.
--------------- ............................ ------------------

బ్రాహ్మణేతర విజయము.
కమ్మవారి చరిత్రము.

...................

ఉభయవాద సంగ్రహము.
......................

సీ. క్షత్రియులమని భుజంబు దట్టినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
కమ్మవీరులమంచు గాలుద్రవ్వినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
పౌరుషజ్ఞులమంచు బలుక లాభములేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!
ఐకమత్యమటంచు నార్భటించినలేదు!
సమయ మేతెంచెను క్షాత్రమునకు!

గీ. ధనికులమటంచు మదిలోన దలచవలదు!
పలుకుబడి గలదంచెదన్ గులకవలదు!
క్షాత్రధర్మంబు జూపెడి సమయమిదియె!
సరసమతులార చౌదరి సభ్యులార!!
రచన: బాలకవి కొసరాజు రాఘవయ్య చౌదరి

కొల్లూరు గ్రామమున పందొమ్మిది వందల యిరువది నాల్గవ వత్సరము ఆగస్టు 16,17,18,19
తేదీలయందు కమ్మవారి చరిత్రను గురించి శ్రీపుష్పగిరి పీఠమువారికిని మాకును వాద ప్రతివాదనలు జరిగినవి. అందు జరిగిన వాద ప్రతివాదనల సారాంశము.

ప్రధమ దివసచర్య :--

శ్రీయుత సూర్యదేవర రాఘవయ్య చౌదరిగారి
ఉపన్యాసము.

కమ్మవారు వైదిక మతానుసారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర యను చాతుర్వర్ణములలో నేవర్ణములో జేరుదురాయని యోచించుటకు ముందు వర్ణవిభాగమెటుల నేర్పడెనో విచారించినగాని కమ్మవా రే వర్ణజులో నిరూపించ వీలులేదు. ఈవర్ణ విభాగము గుణకర్మల ననుసరించి యని కొందరును, పుట్టుకచే నని కొందరును వాదనలు జేయుచున్నారు. ఈద్వివిధంబులలోను ప్రధమమున గుణకర్మలచేతనే వర్ణవిభాగము గావించిరని యనేక ప్రమాణములు ద్ఘోషించుచున్నవి. అందులకు ప్రమాణముల గొన్నిటిని నిరూపించెద. చిత్తగింపుడు.

శ్లో. తమశ్శూద్రేరజఃక్షత్రే బ్రాహ్మణే సత్యముత్తమమ్.

అనగా తమోగుణమునకు శూద్రయనియు, కించత్తమోగుణముతో గూడిన రజోగుణమును వైశ్యయనియు, రజోగుణమును క్షత్రియయనియు, సాత్విక గుణమును బ్రాహ్మణయనియు భాగించిరి. వెండియు,

శ్లో. నచర్మణోనరక్తస్య నమాంసస్యనచాస్తినః
నజాతిరాత్మనో జాతిర్వ్యవహారేణ ప్రకల్పితాః.
- నిరాలంబో పనిషత్.

చర్మమునకు జాతిలేదు. రక్తమునకు జాతిలేదు. మాంసమునకు జాతిలేదు. ఎముకలకు జాతిలేదు. జీవునకు జాతిలేదు. జాతి యనడము వ్యవహారమునకు కల్పితము.

ఇటుల నెన్నియో ప్రమాణములు గుణకర్మలననుసరించియే వర్ణవిభాగంబని ధృవపరచుచున్నవి. కాని కొందరిపుడు బ్రాహ్మణోస్యముఖమాసీత్, అను ఋక్కునకు బ్రాహ్మణులు ముఖమందు బుట్టిరనునర్ధముజెప్పుచు వర్ణవిభాగము పుట్టుకచే నని వాదించుచున్నారు. అటులనాఋక్కునకు పైవిధమున నర్ధము చెప్పునెడల ‘ బ్రాహ్మణోస్యముఖమాసీత్ ’ అను ఋక్కునకు తరువాత, ‘చంద్రమామనసౌజాతశ్చక్షుస్సూర్యాజాయత’ అని యున్నది. ఈఋక్కునకు మనస్సునకు చంద్రుడు, చక్షువులకు సూర్యుడు బుట్టిరని వైవిధముగ నర్ధము జేయునెడల ‘బాహురాజన్యః కృతః’ అను వాక్యానుసారమున “చంద్రమా” అను ఋక్కుచే సూర్య చంద్రులు భుజములందు బుట్టకపోవుటచేత క్షత్రియులుగారనవలయు. సూర్యుడు, చంద్రుడు క్షత్రియులు గాని యెడల సూర్యచంద్రవంశజులు క్షత్రియులుగారనవలయు. అయ్యది లోకవిరుద్ధముగావున ‘బ్రాహ్మణోస్యముఖమాసీత్’ అనుఋక్కు పుట్టుకచే వర్ణవిభాగంబని నిరూపణ జేయుటలేదని ధృవంబగుచున్నయది. ఈప్రమాణవచనము లన్నింటిని కడద్రోసి పుట్టుకచేతనే వర్ణవిభాగంబని వాదించుచున్నవారికి గొన్నిప్రశ్నలిచ్చెద. జవాబొసంగుడు.

1) కర్ణధర్మజుల జన్మకధనము, వర్ణములేమి?
2) కృపుని జన్మకధనము, పెంచినవారు, వర్ణము లేమి?
3) కర్ణుడు మరణపర్యంతము శూద్రుడని వ్యవహరింపబడుటకు కారణమేమి?
4) ఋషభమహారాజునకు ఏకసతియందు గల్గిన నూర్వురు పుత్రులలో కొందరు బ్రాహ్మణులు, కొందరు క్షత్రియులు నగుటకు కారణమేమి?
5) భాగవతమునందలి రంతీదేవునిచరిత్రమునందు చెప్పిన చంద్రవంశజులగు క్షత్రియులు బ్రాహ్మణులెట్లైరి?
గుణకర్మలచే వర్ణవిభాగంబను చట్టముననుసరించి క్షత్రియ చిహ్నమగు రజోగుణముతో గూడినవారై నిన్న మొన్నటివరకు నాయుధజీవులైయున్న కతన కమ్మవారు క్షత్రియులటకర్హులు. అధవా క్షత్రియుల క్ండవలసిన గుణకర్మ లసంపూర్తిగా నున్నందున నటులనుటకు వీలులేదందురా! ప్రస్తుతము బ్రాహ్మణులమనుకొనువారి యందంతకన్న తక్కువగ బ్రాహ్మణ గుణకర్మలుండి వారెటుల బ్రాహ్మణ నామమున కర్హులో యటులనే కమ్మవారును క్షత్రియ నామమున కర్హులు. అదియునుంగాక గుణ కర్మలచే వర్ణవిభాగంబను చట్టము ననుసరించి ప్రత్యేక వ్యక్తులగుణకర్మల ననుసరించి వర్ణవిభాగము గావింపవలె నందురా? ఆధర్మమన్ని కులములకు జెందిన కమ్మవారికిని జెందును. (అపుడీదేశము మహోన్నతపదవినందును.) కావున గుణకర్మల ననుసరించి వర్ణవిభాగంబను చట్టము ప్రకారము కమ్మవారు శూద్రులు గారనియు, క్ష
త్రియులనియు దేలుచున్నది. ఇక పుట్టుకచే వర్ణవిభాగచట్టము ప్రస్తుత మమలులోనున్నదాని ననుసరించి విచారించిన కమ్మవారు క్షత్రియులని
యే తెల్లంబగుచున్నది. ఎటులన పుట్టుకచే వర్ణవిభాగంబను నపుడు వంశానుక్రమణి ననుసరించి వర్ణవిభాగము గావింపవలె. అందును గూర్చి యీకమ్మవారి పూర్వులెవరాయని విచారింప (ఆంధ్రుల చరిత్ర ద్వితీయ భాగము ననుసరించి) కోట కేతరాజు, కొండపడమటి బుద్ధరాజు కమ్మవారుగ వ్యవహరింపబడినటుల దెలియచున్నది. ఆపురుషద్వయముయొక్క చరిత్రను బట్టిచూడ వారు (1) దుర్జయ కులాభరుణులమనియు, (2)బుద్ధవర్మ వంశములోని వారమనియు. (3) చతుర్ధాన్వయులమనియు చెప్పుకొనినటుల విశదమగును. అందు దుర్జయ కులాభరణులనగా దుర్జయుని కులము వారనియు, బుద్ధవర్మ వంశమనగా బుద్ధవర్మనుండి చీలిన శాఖ వారమనియు, చతుర్ధాన్వయులనగా నాల్గవగోత్రము గల వారనియు నర్ధములు. వారుదహరించిన యావాక్యములబట్టి చూడగా కమ్మవారి కాదిపురుషుడు దుర్జయుడైనటుల సద్ధాంతంబగు చున్నది. ఇటుల దుర్జయ కులాభరణులమని చెప్పుకొనినది కమ్మవారేగాక కాకతీయులును, సాగివంశము వారును గలరు. వీరందరికిని మూలపురుషుడైన దుర్జయుడేకులమువాడని విచారించిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి శాసనములో నావిషము సవిస్తరముగా వివరింపబడినది. ఎటులనగా..
గణపతి దేవచక్రవర్తి శాసనమున సూర్యవంశమున మనువు, అతని వంశమున నిక్ష్వాకువు, అతని వంశమున రఘువు, అతని వంశమున దాశరధి, అతని వంశమున గరికాలచోడుడు, అతని వంశమున దుర్జయుడు, అతని వంశమున కాకతీబేతరాజు జనించిరని చెప్పబడియున్నది. (కాని దాశరధి వంశమున గరికాలచోడుడు బుట్టినటుల తత్పూర్వ శాసనములుగాని, చరిత్రలుగాని, పురాణాదులుగాని నిరూపింపలేదు.) దీనినిబట్టి విచారింపగా దుర్జయుడు గరికాలచోడుని వంశములోని వాడనగా చోళులలోనివాడని ధృవంబగుచున్నది.
సదయహృదయులారా! ఇంతదనుక పరిశీలించిన చరిత్రనుబట్టిచూడ (1) కమ్మవారు (2) కాకతీయులు (3) సాగివంశమువారు దుర్జయ కులాభరణులనియు, చోడులలోని వారనియు సిద్ధాంతమైనది. ఈమూడు శాఖలలో కాకతీయులు నేడు మందపాటివారను గృహ నామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు. కమ్మవారని వ్యవహరింపబడిన కోట కేతరాజు వంశజులు నేడు దాంట్లవారను గృహనామముతో సూర్యవంశపు క్షత్రియులుగ వ్యవహరింపబడుతున్నారు.
వీరందరటుల వ్యవహరింపబడుచుండ నేడు కమ్మవారిని గురించి యీచర్చ గలిగిన కారణంబేమనగా, వారెల్లరు సూర్యవంశజులుగ వ్యవహరింపబడుట గణపతిదేవ చక్రవర్తి కిటీవలనేగాని తత్పూర్వము లేదు. పూర్వమువారు వైదిక మతమెరుగ నపుడు తమ దేవర్ణమో నిరూపణజేయక పిమ్మట వైదిక మత ప్రచారకులు మనదేశము వచ్చిన వెంటనే సూర్య చంద్ర వంశములకు భిన్నమైన క్షత్రియ కులముగ నిరూపణ జేయుట నటువెన్క తాము వైదిక మతమవలంబించిన దాది సూర్యవంశపు క్షత్రియులుగ బేర్కొన సాగిరి. వారు వైదిక మతమవలంబించినపుడు గుణకర్మలచే వర్ణవిభాగము గావింపబడుచుండెను. పిమ్మటనద్దాని నటుంచి పుట్టుకచే వర్ణవిభాగ మేర్పడునపుడే యంతదనుక జన్నిదములు ధరించనివారు శూద్రులనియు, వారికి వేదాధికారము లేదనియు నేర్పరచిరి. (అటుల మార్పుగలుగుటచేతనే వర్ణవిభాగమును గూర్చియు, వేదాధికారమును గూర్చియు చర్చలుజేయు ఉభయవాదనలకు ప్రమాణములు లభించుచున్నవి.) అటుల మధ్యకాలమున వైదికమతచట్టము మార్పొందుటకుపూర్వము కమ్మవారనుశాఖలో జేరిన వేణ్ణియభట్టు, దేవనయ్య మున్నగువారు వైదికమత మవలంబించి యజ్ఞయాగాది క్రతువులుజేసి బ్రాహ్మణులై యప్పటి రాజలోకముకడ నగ్రహారములు బొందిరి. (వారి శాఖవారిపుడు బ్రాహ్మణులలోజేరి కమ్మవారనగా శూద్రులనుటకు వెనుదీయకుండిరి.) వైదికచట్టము మార్పొందిన పిమ్మట కొంతకాలమునకు వైదికమతాచారణ పరులైనందున వొడ్డెలు, కాళింగులు, సాలీలు, భట్రాజులు మున్నగువారు ఉపనయనము జేయించుకొనుచుండినను శూద్రస్వరూపముతో మెలంగుచుండిరి. కమ్మవారో! ఉపనయనాది క్రియాలోపములతో నున్నను ఒడ్డెలు, సాలీలు మున్నగువారి కందరికన్న మిన్నలని వ్యవహరింప బడుతున్నారు. అటుల వ్యవహరింప బడుచుండినను వీరు శూద్రవృత్తులులేక నాయుధోపజీవులై యున్న కతనశూద్రులని యెప్పుడు నే గ్రంధమునందును, నే శాసనమందును వక్కాణింప బడక చతుర్ధాన్వయులనియు, చతుర్ధ వంశజులనియు, చతుర్ధ కోటియనియు, గంగకు సైదోడులై శ్రీహరి పాదపద్మములందు బుట్టిరనియు నిగూఢపదప్రయోగములతో వ్యవహరింప బడుచుండిరి. రాను రాను యిటీవల మాత్రము శూద్రులను వాదనలు బయలుదేరుచున్నవి. ఏవాదనలెట్లు బయల్వెడలినను పుట్టుకచే వర్ణవిభాగంబను చట్టము ననుసరించి ప్రత్యక్ష ప్రమాణముల దుర్జయ కులజులు కొందరు ద్విజులుగ నేడుపరిగణింపబడుటచేత వీరును ద్విజులనుట కావంతయు సందియములేదు. మరియు నొక్కవిశేషంబు తిలకింపుడు. కమ్మవారు చోడులైన, వెలమవారు, బలిజవారు, రెడ్డివారలెవరని ప్రశ్నించెదరేని వినుడు. కమ్మ రెడ్డి శాఖలవారు చోడులు, వెలమ బలిజ శాఖలవారు చాళుక్యులు. ఇందును గురించి ప్రమాణము లనేకములు గలవు. గ్రంధ విస్తరభీతిచే వివరింపనైతి.
సత్యా సత్య విమర్శకులారా! యింతదనుక విమర్శించిన యంశములటుంచి వర్తమానకాలమున కమ్మవారియాచరణ ననుసరించియు వీరు శూద్రులుగారని ధృవంబగుచున్నది. ఎటులనగా వీరికి జన్నిదములు లేనందున శూద్రులనుటకు జన్నిదములు గలవారిని శూద్రులనరాదుగదా! అటులగాక జన్నిదములు గలవారిని సైతము శూద్రులనుటచే వీరికి జన్నిదములు లేనంతమాత్రమున శూద్రులనరాదు. మరియు వేదోక్త కర్మలు లేనికారణముచే వీరు శూద్రులా యనుకొనుటకు ద్విజులలో జేరిన కోమట్లకు వేదోక్తము లేకపోయినను శూద్రులనుటలేదు. గావున వేదోక్తము లేనంతమాత్రముచే వీరిని శూద్రులనరాదు. అదియునుంగాక వీరికి ఋషిగోత్రములు లేనికారణముచే శూద్రులాయని తలంచుటకు కోమట్లకు ఋషిగోత్రములు లేవు. వారిని శూద్రులనుటలేదు. భట్రాజులకు ఋషిగోత్రములు గలవు. వారిని ద్విజులనుటలేదు. మరియు గోత్రములావంశమూలపురుషుని దెలుపుటకు బుట్టినవిగాని వర్ణనిరూపణకు బుట్టినవికావు. కనుక ఋషిగోత్రములు లేనంతమాత్ర్ముచే వీరిని శూద్రులనరాదు. వీరు నిన్న మొన్నటి వరకునాయుధోప జీవులైయుండిరి. నేడు వృత్తినిబట్టి శూద్రులనుటకు వైశ్యవృత్తియగు వ్యవసాయ పశుప
పేజి 9
రిపాలనయే వీరాచరించు వృత్తి అందుచే శూదృలనరాదు. అదియునుంగాక అమరము, మనుస్మృతి మున్నగు గ్రంధములలో శూద్రులలోగల అంతఃశాఖల నన్నిటి వేరు వేరుగా నిరూపించిరిగాని అందు కమ్మవారిని నిరూపించలేదు. ద్విజులలోను చేర్చలేదందురా? ద్విజులలోగల అంతఃశాఖల నిరూపించలేదు. కాన వీరినందు దాహరింపలేదు. శూద్రులలోగల అంతఃశాఖల నిరూపించుచు వీరిని నిరూపించకపోవుటచేత శూద్రులుగారని యాగ్రంధ కర్తలే సిద్ధాంతము జేసినటుల దృఢమగుచున్నది. మరియు శూద్రులలో (1) సచ్చూద్రులు (2) శూద్రులు (3) అంత్య శూద్రులనియు మూడు విధములుగా నాగ్రంధములో నిరూపించుచు నామూడు విధములలో సచ్చూద్రులు మిన్నలనియు సచ్చూద్రౌగోపనాపితౌ, అనగా మంగలి గొల్ల సచ్చూద్రులనియు జెప్పిరికావున శూద్రవర్ణములలో కెల్ల మిన్నలగు మంగలి, గొల్ల, వారలకన్న నధికులుగా నెంచబడు వీరు శూద్రులుగారని యెంతటి మందమతియైనను తలచకపోడు. పూర్వపు గ్రంధములిటుల నిరూపణచేసియున్నను, వైదికము వృద్ధియైనదాది వీరినిగురించి చతుర్ధాన్వయులనియు, చతుర్ధకోటియనియు, శ్రీహరిపాద పద్మములందు గంగకుసైదోడులై బుట్టిరనియు నిగూఢవచనంబులు గ్రంధాదులందు బ్రయోగింప మొదలిడిరి. ఇపుడిపుడు శూద్రులనుటకు సాహసించి యిటీవల నచ్చువేయు వ్యాకరణాదులలో ‘కమ్మ’ శూద్రులలో బేధమని కల్పించి గ్రంధములలో నిరికించుచున్నారు. గ్రంధావలోకనచే పూర్వమేవర్ణమనక పోవడము నపుడు వైదికమతము లేకపోవడముచే ననియు మధ్య నిగూఢవచనములు ప్రయోగించుట అప్పటివారికి వీరు శూద్రు

పేజి 10

లుగారని యెరిగియుండి వీరుపనయనాది క్రియాలోపముగ నుండుట చేత వీరి కా నిగూఢవచనములు ప్రయోగించిరనియు, యిటీవల వీరి యుదంతమెందున లేకున్కియా నిగూఢవచనముల సహాయంబునను, వీరాచరించు క్రియాలోపముచేతను, విరిని శూద్రులనుచుండిరనియు విదితమగుచున్నది. ఈ విషయము లటుంచుడు. వైదిక మత గ్రంధములలో శూద్రునకు సేవకావృత్తి యే జీవనమనియు ద్విజ శిశ్రూష జేయవలయుననియు నియమములు జెప్పియున్నవిగదా! ఆ నియమములు శూద్రులలోకెల్ల మిన్నయగు మంగలి దగ్గరనుండి తక్కువ జాతులకడ కొంచముగనో, గొప్పగనో నున్నవిగాని ఒకప్పుడు గాకపోయినను, మరి యొకప్పుడైనా యా నియమము లీ కమ్మవారి యందు లేని కారణమేమని యోచింప వీరు శూద్రులు గారనియు అందుచే యా నియమములు వీరిదరి చేరలేక పోయెననియు యంతరాత్మ బోధించుచున్నది. తిలకింపుడు. అశౌచవిధి ననుసరించి విచారింప ‘మానశూద్ర స్వకీర్తితః’ అని శూద్రునకు నెలదినము లశౌచవిధి చెప్పియున్నది. ఈ కమ్మవారు పదునైదు దినములే అశౌచ విధి జరుపుటచేత శూద్రు లనరాదు. ఇంతయేల? ‘నశూద్రరాజ్యేని వసేత్’ అని శాస్త్రవచనము లున్నవిగదా! ఈ కమ్మవారు శూద్రులైన వీరు కిరీటాధిపతులై పరిపాలించిన రాజ్యమున బ్రాహ్మణు లెట్లు నివసించిరి. వారిచే నగ్రహారముల నెటుబొందిరి? రాజాధిరాజా, మహారాజాయని స్తోత్రము లెట్లు జేసిరి? ఈవిషయములన్నియు నిష్పక్షపాతబుద్ధితో పరిశీలించినవారికి కమ్మవారుశూద్రులుగారని తోపకపోదు. అట్లు జూడక వాదించువారికి వందనము లర్పించెదగాక! వేరు వివరింపజాలనని చెప్పి విరమించెను. అంతట శ్రీయుత దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరిగారు లేచి యిట్లుపన్యసించిరి.



























































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి